Yashsvi Jaiswal Sensational : దులీప్ ట్రోఫీ ఫైన‌ల్ కు చేరుకున్న సెంట్ర‌ల్ జోన్

జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ గ‌ట్టెక్క‌ని వెస్ట్ జోన్

Hello Telugu - Yashsvi Jaiswal Sensational

Hello Telugu - Yashsvi Jaiswal Sensational

Yashsvi Jaiswal : బెంగ‌ళూరు : స్టార్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashsvi Jaiswal) త‌ళుక్కున మెరిసినా, హాఫ్ సెంచ‌రీ సాధించినా త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వెస్ట్ జోన్ ను ఫైన‌ల్ కు చేర్చ‌లేక పోయాడు. దీంతో ఊహించ‌ని రీతిలో సెంట్ర‌ల్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైన‌ల్ కు చేరుకుంది. ఆదివారం బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో సెంట్ర‌ల్ జోన్ స‌త్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. యశస్వి జైస్వాల్ యొక్క మెరిసే అర్ధశత కేవలం వ్యక్తిగత మైలురాయిగా మిగిలి పోయింది. సెప్టెంబర్ 11 నుండి జరగనున్న ఫైనల్‌లో సెంట్రల్ జోన్ ఇప్పుడు సౌత్ జోన్‌తో తలపడనుంది.

Yashsvi Jaiswal Game

జైస్వాల్ 70 బాల్స్ ఎద‌ర్కొని 64 ర‌న్స్ చేశాడు. వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 216 ర‌న్స్ చేసింది. 162 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం ప‌ని చేయ‌లేదు. సెంట్ర‌ల్ జోన్ 600 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. సరణ్ష్ జైన్ 63 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. టీ బ్రేక్ స‌మ‌యంలో షార్దూల్ ఠాకూర్ ఆరు ప‌రుగ‌ల‌కే వెనుదిరిగాడు. త‌నుష్ కోటియ‌న్ 40 ర‌న్స్ తో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో ఇరు జ‌ట్ల కెప్టెన్లు డ్రాగా ముగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై అంపైర్లు సైతం ఓకే చెప్ప‌డంతో చివ‌ర‌కు భారి ఆధిక్యం కార‌ణంగా సెంట్ర‌ల్ జోన్ సునాయ‌శంగా దులీప్ ట్రోఫీ ఫైన‌ల్ కు చేరుకుంది. జైశ్వాల్ మెరుపులు వ‌ర్క‌వుట్ కాలేదు.

Also Read : Popular Director Sukumar : పుష్ప‌-3పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Exit mobile version