Toxic : బెంగళూరు : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన యశ్. తను గతంలో ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్ల వర్షం కురిపించేలా చేసింది. తన నటనతో కోట్లాది మంది అభిమానులను పొందాడు. ఇక మేకింగ్, టేకింగ్ లో స్పెషలైజేషన్ కలిగిన నీల్ తనకు వరల్డ్ వైడ్ గా ప్రాముఖ్యత పొందేలా చేశాడు. ఆ తర్వాత నటిస్తున్న మూవీ టాక్సిక్ (Toxic). దీనిని దర్శకురాలు దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. లక్షలాది మంది ఫ్యాన్స్, సినీ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు టాక్సిక్ మూవీ కోసం. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , ఫస్ట్ లుక్ దుమ్ము రేపుతోంది. తాజాగా శుక్రవారం కీలక అప్ డేట్ వచ్చింది ఈ మూవీ గురించి.
Toxic Movie Updates
టాక్సిక్ చిత్రం వచ్చే ఏడాది 2026 మార్చి 19 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. చిత్రానికి సంబంధించి చివరి దశ చిత్రీకరణ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. పూర్తి స్థాయిలో సినిమా ప్రమోషన్స్ జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి వినపడుతున్న టాక్. ఇప్పటికే టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. అన్ని పుకార్లకు స్వస్తి పలికి, రాకింగ్ స్టార్ యష్ యాక్షన్-డ్రామా కోలాహలం మొదలయ్యేందుకు సిద్దం అవుతోంది. కాగా మొదట ప్రకటించినట్లే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.
Also Read : MLA P Sudarshan Reddy Growth : తెలంగాణ సర్కార్ సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి


















