Yanamala : అమరావతి – మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala) సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై. ఆయన వ్యవహారం రోజు రోజుకు శ్రుతి మించుతోందంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు గనుక చెలరేగి పోతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు యనమల రామకృష్ణుడు.
Yanamala Ramakrishnudu Slams YS Jagan
ప్రజా స్వామిక వాదులు , మేధావులు, బుద్ది జీవులు జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఖండించాలని కోరారు. ప్రజాస్వామ్యం ఉన్నది విధ్వంసకరమైన ఆలోచనలు కలిగి ఉన్న వారి కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఇంకా ధ్వంసం చేస్తాననేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేర పూరిత వ్యాఖ్యలు, కక్ష తీర్చుకునే స్వభావాన్ని ప్రజలు ఏనాటికీ, ఎప్పటికీ క్షమించరని, సహించరని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ఐదేళ్లు చేసిన ధ్వంసం మళ్లీ చేస్తామంటే స్వాగతించేందుకు సిద్ధంగా లేరని అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడంతో పవర్ లోకి వచ్చిన కూటమి సర్కార్ వాటిని గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతోందన్నారు. ఇంకెంత కాలం ఇలాంటి రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించారు జగన్ రెడ్డిని నేరుగా. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీని, జగన్ రెడ్డికి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : Tirupati – Dr Sirisha Interesting Comments : స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు తిరుపతి ప్రజలకు అంకితం
















