హైదరాబాద్ : డైమండ్ డెకాయిట్ మూవీ ఆడియోను ప్రముఖ దర్శకుడు ఆదిత్య విడుదల చేశారు. సినిమా బిగ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న పోటీకి తెర లేపింది. ఈ చిత్రంలోని “మరదలివే” పాటకు హుక్ స్టెప్ ఛాలెంజ్ ను ప్రకటించింది. ఆసక్తిగల వారు వారు ఆ పాటకు తమ హుక్ స్టెప్‌తో రీల్స్ రూపొందించి, ఆ రీల్స్ లింక్‌ను 8074801661 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని కోరారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రథమ బహుమతి కింద రూ. 1 లక్ష, రెండవ బహుమతి కింద రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించదానికి ఈ ఛాలెంజ్ ను ప్రకటించామని చిత్ర యూనిట్ తెలిపింది.
‘డైమండ్ డెకాయిట్’ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం” అని ప్రకటించారు దర్శకుడు సూర్య జి. యాదవ్ . ముఖ్య అతిథి వి.ఎన్. ఆదిత్యకి ధన్యవాదాలు. సినిమాలోని పూర్తి లిరీక్ సాంగ్‌ను కూడా విడుదల చేశాం. 5 పాటలు, మ్యూజిక్ నిజంగా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ మా సినిమాకు అదృష్టం. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా బీజీఏం కూడా బాగా ఇచ్చారు. కెమెరా, నటీనటులు, మిగతా చిత్రబృందం బాగా చేయడం వల్లే సినిమా బాగా వచ్చింది. దర్శకత్వం నిర్వహణలో మా హీరో, నిర్మాత పార్ధ గోపాల్ పూర్తి సపోర్టు ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం చేస్తున్నారు . సినిమా ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా మేళవింపుతో ఉంటుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం” అన్నారు.
