గుజరాత్ : ఐసీసీ టి20 టోర్నమెంట్ లో సూపర్ -8 లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఆ నాలుగింట్లోను జయకేతనం ఎగుర వేసింది. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన పోరులో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడింది . భారీ తేడాతో ఓడించింది. ప్రస్తుత అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది ఇండియా. ప్రస్తుతం భారత జట్టు కీలకమైన సమస్యను ఎదుర్కొంటోంది. అదేమిటంటే ఇప్పటి వరకు స్టార్ ప్లేయర్, హిట్టర్ అభిషేక్ శర్మ ఇంకా బోణీ కొట్టలేదు. తనను ఏరికోరి టీం మేనేజ్మెంట్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొనసాగిస్తూ వచ్చారు. గత ఎనిమిది మ్యాచ్ లు ఆడితే వరుసగా ఈ ప్లేయర్ ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. తన బ్యాట్ కు ఇంకా పని చెప్పలేదు.
ఈ తరుణంలో మరో ఓపెనర్ గా పనికి వస్తాడని అనుకుంటే సంజూ శాంసన్ సైతం స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లో తను 5 మ్యాచ్ లు ఆడాడు. కేవలం అన్నీ కలిపి 50 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ డకౌట్ కూడా ఉంది. ఈ తరుణంలో గత్యంతరం లేక శాంసన్ ను నమీబియాతో ఆడించారు. తను వస్తూనే ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 3 సిక్సులు ఒక ఫోర్ ఉంది. 24 రన్స్ చేశాడు. ఆ తర్వాత తీసుకోలేదు. తనను బెంచ్ కే పరిమితం చేశారు. ఇప్పుడు ఆదివారం జరగబోయే కీలకమైన మ్యాచ్ లో శాంసన్ ను ఆడిస్తారా లేక అభిషేక్ శర్మను కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
