హైదరాబాద్ : ధర్మశాల వేదికగా ఆదివారం టి20 సీరీస్ ఎవరిదని నిర్దేశించే కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా భారీ తేడాతో సౌతాఫ్రికా జట్టును ఓడించగా అందుకు ప్రతీకారంగా సఫారీ టీం అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టుకు చుక్కలు చూపించింది ముల్లాన్ పూర్ లో జరిగిన 2వ టి20 మ్యాచ్ లో . మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే 2 మ్యాచ్ లు అయిపోయాయి. వచ్చే ఏడాది 2026లో టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పటి నుంచే సన్నాహక మ్యాచ్ లుగా ఉపయోగ పడతాయని భావించింది బీసీసీఐ . అయితే ఎలాంటి పర్ ఫార్మెన్స్ చూపకుండా జట్టుకు భారంగా మారినా కంటిన్యూగా శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప, కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ , సునీల్ మనోహర్ గవాస్కర్, శఠగోపన్ రమేష్ , రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్వాకంపై. ఒంటెద్దు పోకడపై. జట్టు విజయం సాధించడం ముఖ్యమని, వ్యక్తిగత ఇష్టాలకు తావులేదని పేర్కొంటున్నారు. అయినా గంభీర్ డోంట్ కేర్ అంటున్నాడు. తనకు నచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను కావాలని పక్క పెడుతుండడం పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యాడు. అయినా తన తీరు మార్చుకోవడం లేదు. ఓ వైపు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు తోడు గంభీర్ ఇద్దరూ కలిసి సంజూ శాంసన్, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్ కెరీర్ లను నాశనం చేస్తున్నారంటూ భగ్గుమంటున్నారు. మరి ఇవాళ ధర్మశాలలో జరిగే మ్యాచ్ లో నైనా శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.


















