Mohammad Azharuddin : హైదరాబాద్ – మణికట్టు మాంత్రికుడిగా పేరు పొందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నడు. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడు. మరోసారి పోటీకి సిద్దమయ్యాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా చక్రం తిప్పాడు. అజహరుద్దీన్ (Mohammad Azharuddin) తో పాటు కోదండరాం రెడ్డిని మరోసారి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తున్నట్లు శాసన సభలో ప్రకటించాడు. ఇంతకూ అజ్జూ భాయ్ ఎమ్మెల్సీ అవుతాడా, మంత్రిగా కొలువు తీరుతాడా అన్నది వేచి చూడాలి.
ఇక అజహరుద్దీన్ (Mohammad Azharuddin) గురించి చెప్పాలంటే తను విఠల్ వాడిలో ఫిబ్రవరి 8, 1963లో పుట్టాడు. హైదరాబాద్‌లోని ఆస్మానియా విశ్వ విద్యాలయం నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి కనబరిచాడు . 1984లో భారత జట్టులో అరంగేట్రం చేశారు తన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్) శతకం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచారు. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అజహరుద్దీన్.
Mohammad Azharuddin Sensational
మధ్య తరగతి బ్యాట్స్‌మన్‌గా, స్టైలిష్ ఫ్లిక్స్‌తో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది . కెప్టెన్‌గా భారత జట్టును దాదాపు 47 టెస్ట్‌లు, 174 వన్డేలు నడిపించాడు. 90వ దశకంలో టీమ్ ఇండియాకు విజయాలు సాధించడంలో కీలక పాత్ర వహించారు. వన్డేల్లో 9,000 వేల పరుగులు , టెస్టుల్లో 6,000 రన్స్ చేశాడు. 29 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. తరువాత కోర్టు విచారణలో తప్పు నిరూపితం కాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మొదటిసారి 2009లో మోరాదాబాద్ (ఉత్తరప్రదేశ్) నుండి ఎంపీగా గెలిచారు.2019లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. 1986లో అర్జున అవార్డు, 1988లో పద్మశ్రీ పురస్కారం పొందాడు. క్రికెట్ చరిత్రలో అత్యంత సొగసైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అతి ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నారు. 1996 విశ్వకప్ (World Cup) లో భారత జట్టును సెమీ-ఫైనల్ వరకు నడిపించారు. అజహరుద్దీన్ నాయకత్వంలో భారత్ అనేక సిరీస్ విజయాలు సాధించింది, ముఖ్యంగా దేశీయ మైదానాల్లో.
Also Read : YSR Death Anniversary : మరణం లేని మహా నాయకుడు వైఎస్సార్



















