సీఎం జోసెఫ్ విజ‌య్ పై నాకెందుకు అసూయ‌

మాజీ సీఎం ఎంకే స్టాలిన్ పై షాకింగ్ కామెంట్స్

hellotelugu-Rajinikanth

 

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోగా పేరు పొందిన త‌లైవా ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌నంగా మారారు. దేశ వ్యాప్తంగా త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ర‌జ‌నీకాంత్ తొలిసారిగా స్పందించడం ఆస‌క్తిని రేపింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం జోసెఫ్ విజ‌య్ గురించి ప్ర‌స్తావించారు ప్ర‌త్యేకంగా. నేను రాజకీయాల్లో లేను..విజయ్ ముఖ్యమంత్రి కావడంపై నేనెందుకు అసూయ పడతానని అన్నారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. క‌మ‌ల్ హాస‌న్ సీఎం అయితే అసూయ పడేవాన్నేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ నాకు స‌మకాలికుడు కాద‌న్నాడు ఆయ‌న‌కు నాకు 25 ఏళ్ల వ్య‌త్యాసం ఉందని పేర్కొన్నారు ర‌జ‌నీకాంత్. అయితే తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే ప‌వ‌ర్ కోల్పోయింది. అగ్ర న‌టుడు విజ‌య్ స్థాపించిన టీవీకే పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. త‌న పార్టీకి 108 సీట్లు వ‌చ్చాయి. దీనిపై స్పందించారు ర‌జ‌నీకాంత్. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మార్పును కోరుకున్నారని, అందుకే విజ‌య్ ని గెలిపించారని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. . నేను స్టాలిన్ ను క‌ల‌వ‌డంలో ఎలాంటి రాజ‌కీయం లేదన్నారు. స్టాలిన్ నాకు ఎప్పటి నుండో మంచి మిత్రుడు..! ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్నారు ర‌జ‌నీకాంత్. కేవలం ఆయనను స్నేహ పూర్వకంగా కలిసాను.. అది ఒక బాధ్యతగా భావించానని అన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాల క్రమంలో విజ‌య్ ని సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు లేనిపోని ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. అలాంటి నీచ రాజకీయం నేను చేయ‌ను..! నా వ్యక్తిత్వం అలాంటిది కాదని అందరికీ తెలుసని రజనీకాంత్ స్ప‌ష్టం చేశారు.
.

Exit mobile version