హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు, నేతలు, అధికారులదే హవా కొనసాగుతోంది. హైదరాబాద్ ను వీడేందుకు వీరు ససేమిరా అంటున్నారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు విపరీతమైన అధికారాలు ఉంటాయి. అయితే విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలకు సేవలు అందించాలనేది రూల్స్ లో పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఉన్నతాధికారులంతా ఇప్పుడు హైదరాబాద్ జపం చేస్తున్నారు. ఆపై కోర్టుకు కూడా వెళుతున్నారు. తమకు ఆంధ్ర వద్దని తెలంగాణలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలి. ఇప్పటికే కోర్టు కుదరదని, ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. ఈమె చివరి వరకు ప్రయత్నం చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. అయినా పట్టు వీడడం లేదు. తాజాగా మరోసారి కోర్టు మెట్లు ఎక్కింది అమ్రపాలి.
తెలంగాణకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతోంది. తనకు తెలిసిన వారి ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ క్యాడర్లోనే పని చేయాలనుకుంటున్నారు.
దీంతో అమ్రపాలి ఆఖరి పోరాటం చేస్తున్నారు.గతంలో తనను తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై ఇచ్చిన స్టేను ఎత్తి వేయాలని కోర్టును కోరారు. DoPT వేసిన పిటిషన్ కారణంగా క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆమ్రపాలి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఇరువైపుల లాయర్ల సుదీర్ఘ వాదనలను పూర్తిగా ఆలకించిన హైకోర్టు ధర్మాసనం, ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును బట్టి అమ్రపాలి ఏ క్యాడర్లో పని చేస్తారో తేలనుంది.

















