ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకాన్కర్. ఇంతకీ ఎవరు ఈమె అని తెగ వెతుకుతున్నారు . తాజాగా నాసిక్ వేదికగా మాజీ నేవీ ఆఫీసర్ అశోక్ ఖాతర్ తనను తాను స్వయం ప్రకటిత గురువుగా ప్రకటించుకున్నాడు. ఆపై మళలను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో తనతో సాన్నిహిత్యంతో ఉన్న ఫోటోలు ఇప్పుడు రూపాలీ చకాన్కర్ ను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తను కీలక పదవిలో ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గత్యంతరం లేక సీఎం ఫడ్నవీస్ ఆదేశించడంతో తన పదవి కి రాజీనామా చేశారు. శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సుష్మా అంధారే, సామాజిక కార్యకర్త అంజలి దమానియా , ఎన్‌సిపికి చెందిన రూపాలి థోంబ్రే రూపాలీ చకన్కర్ క్షుద్రపూజలు చేస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
43 ఏళ్ల చకన్కర్, దౌండ్‌లోని ఒక రైతు కుటుంబం నుండి వచ్చారు. రాజకీయంగా చురుకైన కుటుంబంలోకి వివాహం తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె అత్త పూణేలో కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు, ఆమె స్వయం సహాయక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పని చేయడం ప్రారంభించారు. తను 2008లో ఎన్‌సిపి మహిళా విభాగంలో చేరి క్రమంగా ఎదిగారు. జూలై 2019లో, చిత్ర వాఘ్ నాయకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది.



















