Sanju Samson : హైదరాబాద్ – కేరళ స్టార్ క్రికెటర్, భారత క్రికెట్ జట్టులో అత్యంత జనాదరణ పొందిన ఆటగాడిగా గుర్తింపు పొందిన సంజూ శాంసన్ ఇప్పుడు మరోసారి సెన్సేషన్ గా మారాడు. గత ఐపీఎల్ సీజన్ లో తనకు మేనేజ్ మెంట్ కు, కోచ్ గా ఉన్న మాజీ భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు మధ్య విభేదాలు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో తను కెప్టెన్ గా ఉన్న గాయపడడంతో ఉన్నట్టుండి జట్టు యాజమాన్యం, కోచ్ లు కలిసి రియాన్ పరాగ్ కు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది సంజూ శాంసన్ (Sanju Samson) రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి వైదొలుగుతాడని . దీంతో తనను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు టాక్.
IPL 2026 – Sanju Samson
ఈ క్రమంలో సంజూ శాంసన్ గనుక ఓకే అంటే తాము తీసుకునేందుకు సిద్దమని బహిరంగంగానే ప్రకటించింది ఇప్పటి వరకు అత్యధికంగా ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్. ఆ జట్టు కూడా శాంసన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈసారి జరిగే ఐపీఎల్ వేలం పాటలో శాంసన్ ను రిలీజ్ చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే తను వైదొలగాలన్నా, లేదా తప్పుకోవాలన్నా లేదా ఆడనని చెప్పాలన్నా ముందుగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ తో ఒప్పందం ఉంటుంది. ఒకవేళ ఇరు జట్ల మధ్య ఒప్పందం కుదిరితే మ్యూచ్ వల్ గా ఆటగాళ్లను మార్చుకునే వీలుంది. మరో వైపు అనూహ్యంగా కోచ్ ద్రవిడ్ తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో శాంసన్ రాజస్థాన్ తరపున ఆడతాడా లేక ఇతర జట్టు లోకి వెళతాడా అన్నది వేచి చూడాలి.
Also Read : GST New Slab Interesting : 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు : నిర్మల సీతారామన్



















