నేను రాసేది ఒకటి తీసేది మ‌రొక‌టి : గీతూ మోహ‌న్ దాస్

టాక్సిక్ ద‌ర్శ‌కురాలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

hellotelugu-GeethuMohandas

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మేకింగ్ స్టైల్, స్క్రిప్ట్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాను పేపర్ మీద రాసే కథ ఒకలా ఉంటుంది.. కానీ సెట్స్‌పైకి వెళ్లాక నేను షూట్ చేసేది మరోలా ఉంటుంది. ఇక ఎడిటింగ్ టేబుల్‌పై కూర్చున్నప్పుడు ఎడిట్ చేసేది ఇంకొకలా ఉంటుంది. ఆ తర్వాతే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను.

నేను ఎప్పుడూ ఒకే స్క్రిప్ట్‌కు కట్టుబడి ఉండనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్. నా తదుపరి సినిమా కోసం నిర్మాతలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు కూడా నేను ఇదే ముందే చెప్తాను.. మీరు పేపర్‌పై ఏ కథనైతే చదువుతున్నారో, స్క్రీన్‌పై మాత్రం కచ్చితంగా అది చూడలేరు అని ముందే స్పష్టం చేస్తానన‌ని పేర్కొంది. ఒక స్క్రిప్ట్ చదివి ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన నిర్మాతలు, ఫైనల్ అవుట్‌పుట్ చూసి ఎలా షాక్ అవుతారోన‌ని సినీ రంగంలో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది . ఏది ఏమైనా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నెగ‌టివ్ టాక్ వ‌చ్చినా టాక్సిక్ దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మొత్తంగా గీతూ మోహ‌న్ దాస్ తాను ఏం చెప్పాల‌ని అనుకున్న‌దో దానినే ధైర్యంగా వెండితెర‌పై వ‌చ్చేలా చేసింది.

Exit mobile version