చెన్నై : భారత క్రికెట్ జట్టు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈనెల 26న గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి 20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆతిత్య టీమిండియాతో జింబాబ్వే జట్టు తలపడనుంది. ఇప్పటి వరకు టోర్నీలో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది భారత్. కానీ అనూహ్యంగా సూపర్ -8 లో బలమైన సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలమైంది. సఫారీల అద్బుతమైన బౌలింగ్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు .
ఇక ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్లు అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్ లు తీవ్ర నిరాశకు గురి చేశారు. ఆదిలోనే చేతులు ఎత్తేశారు. అభిషేక్ నాలుగింట్లో డకౌట్ కాగా 5వ మ్యాచ్ లో పట్టుమని 15 రన్స్ చేశాడు. ఇక సంజూ శాంసన్ స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో 5 మ్యాచ్ లు ఆడాడు. తను కేవలం 50 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో తనకు ఛాన్స్ దక్కలేదు వరల్డ్ కప్ టోర్నీలో. చివరకు అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురి కావడంతో తన స్తానంలో నమీబియాతో జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 రన్స్ చేశాడు. కానీ తదుపరి మ్యాచ్ లలోకి తీసుకోలేదు.



















