ముంబై : ఈనెల 28 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఎన్నికల షెడ్యూల్ కారణంగా కొన్ని మ్యాచ్ లను ఇంకా ప్రకటించ లేదు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. ఈ తరుణంలో గత ఐపీఎల్ సీజన్ లో ఆశించచిన మేర రాణించలేక పోయింది ముంబై ఇండియన్స్. దీనిపై తాజాగా స్పందించాడు ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే. తను శ్రీలంక జట్టుకు మాజీ స్కిప్పర్ గా కూడా ఉన్నాడు. ఈసారి తమ టీం మరింత బలంగా ఉండ బోతోందని స్పష్టం చేశాడు. దీనికి కారణం కూడా తను చెప్పాడు. తమ జట్టుకు చెందిన నలుగురు కీలకమైన ఆటగాళ్లు ఈసారి ఇండియా విశ్వ విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించారని చెప్పాడు మహేళ జయవర్దనే.
ఇవాళ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మీడియాతో మాట్లాడారు. తమ జట్టుకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు అద్భుతంగా ఆడారని, భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపాడు. భారత్ ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడింది, ఫైనల్ కూడా చాలా బాగా ఆడింది. మా జట్టు నుండి నలుగురు ఆటగాళ్లు ఆ జట్టులో భాగం కావడం మాకు చాలా గొప్ప విషయం . ఆ నలుగురి పట్ల నేను చాలా గర్వ పడుతున్నానని పేర్కొన్నారు. వారు తిరిగి వచ్చి మా జట్టులో చేరడం కోసం నేను ఎదురు చూస్తున్నానని అన్నాడు. తాము మా సీజన్‌ను సానుకూల దృక్పథంతో ప్రారంభిస్తామన్నారు. ఈ సారి ఐపీఎల్ భిన్నంగా ఉండ బోతోందన్నాడు.



















