పోలవ‌రం ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రిస్తాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌ల‌శ‌క్తి కార్య‌ద‌ర్శి కాంతా రావు

hellotelugu-Polavaram

అమ‌రావ‌తి : పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని స్ప‌ష్టం చేశారు కేంద్ర జ‌ల‌శ‌క్తి ముఖ్య కార్య‌ద‌ర్శి వీఎల్ కాంతారావు. ఆకృతులకు అనుమతులు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం హైదరాబాద్ లో ఉండటం వల్ల కొంత సమన్వయ లోపం ఉందని, ఇక నుంచి ఆ కార్యాలయం రాజమహేంద్రవరం నుంచి పని చేస్తున్నందున ప్రతి రోజు ఏ సమస్య ఉన్న వెంటనే సమావేశమై పరిష్కరించు కోవాలి అని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్నింటితో తానూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ గురించి కూడా తెలిపారు.

ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని కలియ తిరిగిన కాంతారావు బట్రస్ డ్యామ్ వద్ద పరిశీలన చేశారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2, డి హిల్, జి హిల్ మొదలైన వాటిని పరిశీలించారు. వాటిని పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువు గురించి ఆరా తీశారు. పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సమాంతరంగా జల విద్యుత్ కేంద్రం పనులు జరుగుతున్నాయని, 2028 జనవరి నాటికి అన్ని యూనిట్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. కేంద్ర జలవనరుల కార్యదర్శి కాంతారావు పర్యటన, అనంతరం సమీక్షలో ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల శాఖ కార్యదర్శి ఎం .వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, సీఈ రామచంద్ర రావు, ఎం ఈ ఈ ఎల్ ప్రతినిధులు అంగర సతీష్ బాబు, ఏ గంగాధర్, మురళి పమ్మి, ఏ పీ జెన్కో, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version