YS Jagan : తాడేపల్లి గూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) కీలక ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మాట్లాడారు. తుపాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఈ కాన్ఫరెన్స్‌లో వివరించారు పార్టీ చీఫ్ కు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, తాము క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వివరాలను తెలియ చేశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకు రావడంపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
YS Jagan Key Comments
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని వైయస్. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు గడచిన నాలుగు రోజులుగా చురుగ్గా పని చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో చొరవ చూపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు బాసటగా నిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి తుపాను మిగిల్చిన నష్టాన్ని స్వయంగా చూసి, బాధితులకు భరోసా ఇచ్చారు. వారి నుంచి వివరాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు, రైతులు కోల్పోయిన పంటల వివరాలతో కూడిన పూర్తి నివేదికను పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అందజేశారు.
Also Read : CM Chandrababu Important Comments : తుపాను బాధితులకు సీఎం భరోసా
















