బౌల‌ర్ల వైఫ‌ల్యం వ‌ల్ల‌నే ఓడి పోయాం : శ్రేయ‌స్ అయ్య‌ర్

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స్కిప్ప‌ర్

hellotelugu-ShreyaasIyer

ముల్లాన్ పూర్ : పంజాబ్ లోని ముల్లాన్ పూర్ వేదిక‌గా కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టును ఏకంగా 6 వికెట్ల తేడాతో ఓడించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చింది పంజాబ్. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచాడు రాజ‌స్తాన్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 222 ర‌న్స్ చేసింది పంజాబ్. అనంత‌రం బ‌రిలోకి దిగింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య వంశీ దుమ్ము రేప‌గా ఓప‌న‌ర్ య‌శ‌స్వి జైస్వాల్, పెరీరాలు దంచి కొట్టారు. అనుకున్న ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించారు.

మ్యాచ్ అనంత‌రం ప‌రాజ‌యం పాలు కావ‌డంపై తీవ్రంగా స్పందించాడు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స్కిప్ప‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్. పేలవ ప్రదర్శన చేసిన బౌలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా అభిప్రాయంలో 222 పరుగులు చాలా మంచి స్కోరే. ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన, ముఖ్యంగా కాస్త జిగటగా, నెమ్మదిగా ఉన్న ఈ వికెట్‌పై. మేము నెమ్మదిగా ఆడుతూ యార్కర్లు వేయాలని ప్రణాళిక వేసుకున్నామని చెప్పాడు. కానీ ఆ విషయంలో మా బౌల‌ర్లు పూర్తిగా వైఫ‌ల్యం చెందార‌ని పేర్కొన్నాడు. అలాగే, వారు కూడా చాలా బాగా ఆడారంటూ ప్ర‌శంసించాడు. దుబే, ఫెరీరాల భాగస్వామ్యం అద్భుతం అని తెలిపాడు.

ఈ ఫార్మాట్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ఆటను మార్చుకున్నారు. బౌలర్లు కొత్త ప్రణాళికలతో ముందుకు రావడం ఒక పెద్ద సవాలు. కానీ చివరికి, అంతా అమలు చేయడంలోనే ఉంటుంది. ఈ రోజు మాది కాదన్నాడు అయ్య‌ర్.

Exit mobile version