DK Shivakumar : బెంగళూరు : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎంను మారుస్తారనే ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శనివారం సిద్దరామయ్య పిలుపు మేరకు స్వయంగా తన ఇంటికి వెళ్లారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డీకే శివకుమార్. ఈ (శీతాకాల) సమావేశంలో పార్లమెంటు సభ్యులు లేవనెత్తాల్సిన కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయని అన్నారు. చెరకు, మొక్కజొన్న సమస్యలు, అనేక ఇతర కార్యక్రమాలపై వారు (కేంద్ర ప్రభుత్వం) హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క దానిని కూడా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. కేవలం బీజేపీ పాలిత ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాల పై శీతకన్ను ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డీకే శివకుమార్.
DY CM DK Shivakumar Key Comments
ప్రధానంగా కేంద్రం కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తనతో పాటు సీఎం సిద్దరామయ్య పలుమార్లు ఢిల్లీకి వెళ్లాం. అక్కడ ప్రధానిని కలిశాం. మా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరాం. రావాల్సిన నిధులు మంజూరు చేయాలని విన్నవించినా నేటి వరకు వాటి ఊసెత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. అంతే కాదు నిన్న మాజీ ఎంపీ దినేష్ కూడా ఈ విషయంపై ప్రధానమంత్రిని అభ్యర్థించారు. కాబట్టి మేము మా పార్లమెంటు సభ్యులకు చెప్పబోతున్నాం, రాష్ట్ర సంక్షేమం పట్ల ఆసక్తి ఉంటే, మనమందరం కలిసి వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే అవిశ్వాస తీర్మానం విషయానికొస్తే, వారిని అలా చేయనివ్వండి అని అన్నారు. తాము అసెంబ్లీని , ప్రభుత్వాన్ని నడపగల సామర్థ్యం కలిగి ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read : CM Siddaramaiah-DK Important Meeting : కన్నడ నాట కలిసిన కత్తులు

















