ఇలా వ‌రుస‌గా ఓడి పోతామ‌ని అనుకోలేదు

ముంబై ఇండియ‌న్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా

helloteluguHardikPandya

ముంబై : ఐపీఎల్ 2026 లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలు కావ‌డం ప‌ట్ల స్పందించాడు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మేం ఇంకా మ‌రికొన్ని ప‌రుగులు అద‌నంగా చేర్చి ఉంటే బావుండేద‌ని, అప్పుడు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై ఇంకొంత ఒత్తిడి తీసుకు వ‌చ్చే వాళ్ల‌మ‌న్నాడు. ముందుగా బ్యాటింగ్ చేయ‌డం కూడా త‌మ‌కు డిస‌డ్వాంటేజ్ గా మారింద‌న్నాడు పాండ్యా. నిజాయితీగా చెప్పాలంటే, ఇది మాకు చాలా నిరాశ కలిగించే విషయం అని పేర్కొన్నాడు కెప్టెన్. మేము వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడి పోవ‌డాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామ‌న్నాడు.

ఈ క్లిష్ట స‌మ‌యంలో తాము జ‌ట్టు ప‌రంగా కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు హ‌ర్దిక్ పాండ్యా. జట్టులో కొన్ని కీలక మార్పులు చేయాలని నేను భావిస్తున్నానని అన్నాడు. అయితే దీనికి సంబంధించి బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉందనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. త‌ను చేసిన ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. జ‌ట్టులో స‌మ‌తుల్య‌త లోపించింద‌ని, ఒక‌రంటే ఇంకొక‌రికి ప‌డ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పాండ్యా ఒంటెత్తు పోక‌డ‌నే జ‌ట్టుకు భారంగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంద‌. ఈ స‌మ‌యంలో కెప్టెన్ నుంచి త‌న‌ను త‌ప్పిస్తార‌ని కూడా టాక్ కొన‌సాగుతోంది.

Exit mobile version