తాడేపల్లి గూడెంం: చేనేతలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. చేనేత రంగ అభివృద్ధికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు. . తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ పద్మశాలీ సంఘం, చేనేత సంఘ ప్రతినిధులు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా ఎస్. సవితను కలిశారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అంద జేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను దుశ్శాలువాతో సత్కరించారు.
అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వాల పాలనలోనే చేనేతకు స్వర్ణ యుగమన్నారు. ఆనాడు ఎన్టీఆర్… నేతన్నలకు అండగా నిలిచారని తెలిపారు మంత్రి ఎస్. సవిత. నేడు సీఎం చంద్రబాబు నాయుడు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో నేతన్నల కష్టాలను మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా చూశారన్నారు మంత్రి . కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, చేనేతలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
