Warren Buffett : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) మరోసారి తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ క్లాస్ బీ షేర్లలోని భారీ వాటాను విరాళంగా ఇవ్వడంతో చారిటీ ప్రపంచం మళ్లీ ఆయనపైన దృష్టి సారించింది. శుక్రవారం నాడు బఫెట్ దాదాపు 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విరాళంగా అందించారు. మన రూపాయల్లో ఇది దాదాపు రూ. 51,000 కోట్లు.
Warren Buffett – ఎవరికెంత ఇచ్చారు?
గేట్స్ ఫౌండేషన్‌కు – 9.43 మిలియన్ షేర్లు
సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు – 943,384 షేర్లు
తన పిల్లల ఫౌండేషన్లకు (హోవార్డ్ జీ బఫెట్, షేర్వుడ్, నోవో ఫౌండేషన్లు) – 6,60,366 షేర్లు
ఇవి కలిపితే మొత్తం 12.36 మిలియన్ షేర్లు విరాళంగా ఇచ్చారు. దీంతో ఆయన ఇప్పటివరకు విరాళంగా ఇచ్చిన మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లకు పైగా) దాటింది.
బఫెట్ చెప్పింది ఇదే…
“బెర్క్‌షైర్ షేర్లను అమ్మే ఉద్దేశం లేదు,” అని బఫెట్ వెల్లడించారు. ఇప్పటికే 94 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, 2006లో తన సంపదను దానం చేయడం ప్రారంభించారు. గతేడాది తన వీలునామాను సైతం మార్చి, తన మృతి అనంతరం 99.5% సంపదను తన పిల్లలు పర్యవేక్షించే ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
అయినప్పటికీ బఫెట్ స్ట్రాంగ్
ఇన్ని విరాళాలు ఇచ్చినా కూడా, బఫెట్ ప్రస్తుతం బెర్క్‌షైర్ స్టాక్‌లో 13.8% వాటాను కలిగి ఉన్నారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, ఈ నెల ప్రారంభంలో ఆయన 152 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ప్రపంచంలో ఐదవ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.
స్పాట్‌లైట్ విశ్లేషణ
వారెన్ బఫెట్ నిధుల పరంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంపదను కేవలం కూడబెట్టడం కాకుండా, సమాజానికి తిరిగి ఇచ్చే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. ప్రపంచంలోని ధనవంతులకు ఇది స్ఫూర్తిదాయక మార్గదర్శకమనే చెప్పాలి.
Also Read : HYD Ratha Yatra Sensational : అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ‘జగన్నాథుని’ రథయాత్ర



















