Wang Yi Shocking Comments : యుద్ధాలు సమస్యలను పరిష్కరించ లేవు

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి

Hello Telugu - Wang Yi Shocking Comments

Hello Telugu - Wang Yi Shocking Comments

Wang Yi : చైనా : చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి (Wang Yi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్రపంచంలో కొన‌సాగుతున్న దాడుల ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఆదివారం వాంగ్ యి మీడియాతో మాట్లాడారు. యుద్దాల వ‌ల్ల ఒన‌గూరింది ఏమీ లేద‌న్నారు. ఏ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని, ఆ విష‌యాన్ని ఆయా దేశాలు గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికా ప‌దే ప‌దే ప‌లు దేశాల‌పై సుంకాల‌ను విధించ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆంక్షలు ప్రపంచాన్ని మరింత దిగజార్చాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Wang Yi Key Comments on War

బహు పాక్షికతను ప్రోత్సహించాలని, యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఐక్య‌రాజ్య స‌మితి మెయిన్ చార్టర్ ప్రయోజనాలు, సూత్రాలను సంయుక్తంగా కాపాడాలని పిలుపునిచ్చారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి. స్లోవేనియాలోని ల్జుబ్లాజానాలో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్రసంగించారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి చర్చలను ప్రోత్సహించడానికి చైనా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, ఆంక్షలు వాటిని క్లిష్టతరం చేస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు. స్లోవేనియా ఉప ప్రధానమంత్రి, విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాల మంత్రి టాంజా ఫజోన్‌తో సమావేశం అయ్యారు.

చైనా యుద్ధాలలో పాల్గొనదని, ఎలాంటి ప్లాన్ రూపొందించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు వాంగ్ యి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న గందరగోళం, నిరంతర ఘర్షణల ద్వారా వర్గీకరించ బడిందని పేర్కొన్నారు.

Also Read : FDI Global Growth : ఇండియన్ కంపెనీల గ్లోబల్ విస్తరణలో పన్ను స్వర్గాల ప్రాధాన్యం

Exit mobile version