ఒంటిమిట్ట /తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతా రామ లక్ష్మణులు భక్తులకు అభయం ఇచ్చారు. రాత్రి 7 నుండి వాహన సేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
గరుత్మంతుడు శ్రీమహా విష్ణువుకు నిత్య వాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండ రామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ ఘనంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం జరగనుంది. ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు ఏశారు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో .
ఎప్పటి లాగే సీతా రాములోరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దంతపతులు విచ్చేశారు. భారీ ఎత్తున సాదర స్వాగతం పలికారు.



















