Vivek Agnihotri : కోల్ కతా : ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్ మూవీని తొలిసారిగా కోల్ కతాలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడితో పాటు పలువురు నటీ నటులు పాల్గొన్నారు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా విడుదలైన దాదాపు వారం రోజుల తర్వాత, దక్షిణ కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భాషా భవన్ ఆడిటోరియంలో ప్రదర్శన జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి థింక్ ట్యాంక్‌గా పరిగణించబడే సామాజిక-సాంస్కృతిక వేదిక ‘ఖోలా హవా’ ఈ ప్రదర్శనను నిర్వహించింది.
Director Vivek Agnihotri Attend
ఇది క్లోజ్డ్ డోర్ స్క్రీనింగ్, ఆహ్వానం ద్వారా మాత్రమే హాజరయ్యారు. ప్రేక్షకులలో చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి, బిజెపి నాయకులు, మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్, ఇతరులు ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, జాతీయ గ్రంథాలయం వద్ద పెద్ద సంఖ్యలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మోహరించారు.
ది బెంగాల్ ఫైల్స్ సినిమాను సెప్టెంబర్ 5న దేశ వ్యాప్తంగా ప్రదర్శించ బడినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లోని థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించలేదు. ఈ సినిమా ఆగస్టు 1946లో కలకత్తాలో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే సందర్భంగా జరిగిన మత ఘర్షణల ఆధారంగా రూపొందించారు దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి.
ఇదిలా ఉండగా గతంలో ది తాష్కెంట్ ఫైల్స్ , ది కాశ్మీర్ ఫైల్స్ తీశారు.
ఈ సినిమా నేషనల్ లైబ్రరీలో ప్రదర్శించ బడటం చాలా సంతోషకరమైన విషయం. బెంగాల్ నేపథ్యంలో సాగినప్పటికీ, రాష్ట్రంలోని వివిధ హాళ్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమాను ప్రదర్శించలేక పోవడంతో రాష్ట్ర ప్రజలు ఈ సినిమాను వేరే చోట చూడకుండా నిరోధించడం కూడా నిరాశ పరిచిందన్నారు వివేక్ అగ్నిహోత్రి.
Also Read : Hero Teja Sajja – Mirai : ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది : సజ్జా


















