Vishal : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న విశాల్ అలియాస్ విశాల్ (Vishal) రెడ్డి ఎట్టకేలకు తీపి కబురు చెప్పాడు. ఊహించని విధంగా తనపై జరుగుతున్న ప్రచారానికి తెర దించాడు. గత కొంత కాలంగా హీరోయిన్ సాయి ధన్సికతో డేటింగ్ లో ఉన్నాడు. ఆ మధ్యన తను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అంతకు ముందు సినిమా రంగంలో పలు సినిమాలలో నటించాడు. ప్రత్యేకించి శరత్ కుమార్ కూతురు , విలనిజంకు పేరు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తో లవ్ వ్యవహారం నడిపిట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత తను వేరే వ్యక్తితో డేటింగ్ కొనసాగించింది.
Vishal – Sai Dhansika Engagement
తాజాగా తాను సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నానని స్పష్టం చేశాడు నటుడు విశాల్ . తమ కుటుంబంతో కలిసి ఉంగురాలను మార్చుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి ఈ ఫోటోలు. త్వరలోనే తామిద్దరం పెళ్లి పీటలు ఎక్క బోతున్నామని తెలిపాడు. ఇప్పటి దాకా తనను ఆదరించి, అభిమానించి, ప్రాణ ప్రదంగా ప్రేమించిన వారంతా తమ ఇద్దరిని ఆశీర్వదించాలని కోరాడు విశాల్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఆగస్టు 29వ తేదీకి ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఇవాళ తన పుట్టిన రోజు విశాల్ కు. ఈ చిరస్మరణీయమైన రోజును మరింత అర్థవంతంగా, ఆనందంగా , జీవితంలో మరిచి పోలేని విధంగా ఉండాలనే నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సాయి ధన్సిక హీరోయిన్ గా పేరు పొందింది. తను నటుడిగా గుర్తింపు పొందాడు. ఈ ఇద్దరూ తాము ప్రేమలో కూరుకు పోయామని గత మే నెలలోనే ప్రకటించారు. కాగా ఈరోజు వీరి వివాహం జరగాల్సి ఉండగా.. నడిగర్ సంఘం భవన (తమిళ ఫిల్మ్ అసోసియేషన్) నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నందున వివాహాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
Also Read : Anchor Lobo Shocking : యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష


















