804 ఫోర్లు 300 సిక్స‌ర్లతో విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ రికార్డ్

రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విక్ట‌రీలో కీ రోల్

hellotelugu-ViratKohli

బెంగ‌ళూరు : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. గుజ‌రాత్ నిర్దేశించిన 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించింది. విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. త‌ను 44 బంతులు ఎదుర్కొని 81 ర‌న్స్ చేశాడు. 8 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. ఇదిలా ఉండ‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. త‌న కెరీర్ లో 804 ఫోర్లు 300 సిక్స‌ర్లు సాధించాడు. సంజు శాంస‌న్ , శుభ్ మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్య‌ర్ త‌మ కెరీర్ లో సాధించిన ర‌న్స్ కంటే కోహ్లీ బౌండ‌రీల ద్వారానే ఎక్కువ‌గా ర‌న్స్ సాధించ‌డం విశేషం. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు ర‌న్ మెషీన్. కేవ‌లం బౌండ‌రీల ద్వారానే 4000 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు విరాట్ కోహ్లీ.

ఫోర్ల ద్వారా 3,228 ర‌న్స్ చేస్తే సిక్సుల ద్వారా 1,818 ర‌న్స్ చేశాడు. ఫోర్లు, సిక్సులు క‌లిపి మొత్తం 5,046 ర‌న్స్ చేయ‌డం విశేషం. గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో సిక్స్ బాద‌డం ద్వారా ఐపీఎల్ లో అత్య‌ధికంగా ఫోర్లు, సిక్సులు కొట్టిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఐపీఎల్ 2026లో అత్య‌ధిక సిక్సర్లు బాదిన క్రికెట‌ర్ల‌లో త‌ను మూడో ఆట‌గాడు కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ప‌రంగా చూస్తే సంజు శాంస‌న్ 4,997 రన్స్ చేయ‌గా శుభ్ మ‌న్ గిల్ 4,131 , శ్రేయ‌స్ అయ్య‌ర్ 3,939 ప‌రుగుల‌తో త‌ర్వాతి స్థానాల‌లో ఉన్నారు. కోహ్లీ ఒక్క‌సారి మైదానంలో నిలబ‌డ్డాడంటే ఇక ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది.

Exit mobile version