Vijay : చెన్నై – ప్రముఖ నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ (Vijay) రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ కీలక తీర్మానం చేసింది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ సందర్బంగా విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదని ప్రకటించారు. బీజేపీ విభజన రాజకీయాలు ఇక్కడ చెల్లవని హెచ్చరించారు. మొదటి నుంచి తను కాషాయ పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు.
Vijay As TVK Party CM Candidate
ప్రాంతాలను, రాష్ట్రాలను, మనుషులను మతం పేరుతో విభిజించి పాలించాలని చూసే బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు దళపతి విజయ్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలు తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ పార్టీకి ఏ పార్టీకి లేనంతగా అభిమానులు ఉన్నారని చెప్పారు. ఈ బలం మరింత బలగంగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
విద్య, వైద్యం, ఉపాధి, తమిళ అస్తిత్వం, సంస్కృతి అనేది టీవీకే లక్ష్యమని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు దళపతి విజయ్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. జీఎస్టీని కూడా వ్యతిరేకించాడు. మోదీని, అమిత్ షాను సైతం విడిచి పెట్టలేదు. తనపై ఐటీ దాడులు జరిగినా ఎక్కడా తల వంచ లేదు విజయ్. ప్రస్తుతం డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలను ఓ యుద్దంలా భావిస్తున్నాయి.
Also Read : Deputy CM Pawan Warning : వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్


















