Vijay : చెన్నై : టీవీకే అధికారంలోకి వస్తే మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ పై ఎక్కువగా ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ (Vijay). శనివారం తమిళనాడులోని తిరుచ్చి నుంచి మీట్ ది మై పీపుల్ పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున జనం పోగయ్యారు. దారి పొడవునా నీరాజనాలు పలికారు. ఈ సందర్బంగా విజయ్ ప్రసంగించారు. తిరుచిరాపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చ లేక పోయిందని ఆరోపించారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి డియర్ అంకుల్ అంటూ ఎద్దేవా చేశారు విజయ్. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు డీఎంకేకు చెందిన మంత్రులు.
Thalapathy Vijay Interesting Comments on Women Safety
టీవీకే విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరక్కడైలో జన సమూహాన్ని ఉద్దేశించి అందరికీ వణక్కం అనే సరళమైన నినాదంతో అభివాదం చేశారు. విజయ్ తన పార్టీ ఆచరణాత్మక వాగ్దానాలను మాత్రమే చేస్తుందని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలు, మహిళల సెక్యూరిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఇది సాధారణ సమావేశం కాదని, ఇది ప్రజాస్వామ్య యుద్ధానికి నాంది అని చెప్పారు విజయ్. పోరాటం ప్రారంభమయ్యే ముందు నేను మిమ్మల్ని చూడాలనుకున్నానని చెప్పారు. మహా నాయకుడు అన్నాదురై రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నది ఇక్కడి నుంచేనని అన్నారు. ఇది పెరియార్ నివసించిన భూమి, ఈ నగరం విద్యలో దాని లౌకిక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు టీవీకే విజయ్. అరియలూర్, పెరంబలూర్ జిల్లాలను కవర్ చేశారు.
Also Read : Khairatabad RTO Growth : వేలం పాటలో ఖైరతాబాద్ ఆర్టీఓ రికార్డ్


















