Vijay Deverakonda : హైదరాబాద్ : మరోసారి హాట్ టాపిక్ గా మరారు నటీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. తాజాగా ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు ప్రకటించారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి నెలాఖరులో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఖరారు చేసేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ (Vijay Deverakonda), రష్మికల ఎంగేజ్మెంట్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాము నిశ్చితార్థం సందర్బంగా మార్చుకున్న ఉంగరాలను ప్రదర్శించడం విశేషం. దీంతో ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. ఓ వైపు రౌడీగా పేరు పొందాడు విజయ్ దేవరకొండ. తనను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. తను తీసిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Vijay Deverakonda-Rashmika Mandanna Viral
గతంలో రామ్ గోపాల్ వర్మ శివ తీసినప్పుడు ఎలా సెన్సేషన్ అయ్యిందో అలాగే తెలుగు నాట దుమ్ము రేపింది. దీంతో దేవరకొండ తన ఇంటి పేరును సినిమాగా మార్చేసుకున్నాడు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్, గీత గోవిందం మూవీతో రష్మిక మందన్నాతో కలిసి నటించాడు. ఆనాటి నుంచి దాకా ఈ ఇద్దరూ పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారు. అంతకు ముందు రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది రష్మిక మందన్నా. కానీ వర్కవుట్ కాలేదు. తను పలు సినిమాలలో కీ రోల్ పోషించి టాప్ హీరోయిన్ గా మారి పోయింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారింది రష్మిక మందన్నా. ఇదిలా ఉండగా కావాలని విజయ్ దేవరకొండ తన ఉంగరాన్ని ప్రదర్శించడం , ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Beauty Pooja Hegde : చెక్కు చెదరని పూజా హెగ్డే పాపులారిటీ
