శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

గుజ‌రాతీ సినిమా రీ మేక్ లో చ‌ర్చ‌లు

hellotelugu-VijayDevarakonda

హైద‌రాబాద్ : యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌ను ప్ర‌స్తుతం ఫుల్ బిజీలో ఉన్నాడు. ఇటీవ‌లే పాన్ ఇండియా హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నాతో పెళ్లి చేసుకోవ‌డం తో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా లైమ్ లైట్ లో కి వ‌చ్చాడు. మ‌రో వైపు న‌టుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా త‌న‌కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ‘కల్కి 2898 AD’లో యోధుడు అర్జునుడి పాత్ర పోషించాడు విజయ్ దేవరకొండ . దీంతో ఆయ‌న‌కు మ‌రో ఛాన్స్ ల‌భించింది. ఒక గుజరాతీ సినిమా రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను పోషించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గుజరాతీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లాలో – కృష్ణ సదా సహాయతే ప్రస్తుతం బాగా చర్చనీయాంశమైంది..

ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇంతకు ముందు ఈ ప్రత్యేక పాత్ర కోసం రామ్ చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పాత్రల ఎంపికకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కాబట్టి తాజా సమాచారం కేవలం ఊహాగానాల స్థాయిలోనే ఉంది . అభిమానులు దీనిపై స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, ‘లాలో’ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసి, రూ. 100 కోట్ల మైలురాయిని దాటిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది.

అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భావోద్వేగ కథనం, ఆధ్యాత్మికత, ఆసక్తికరమైన ఇతివృత్తంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఆర్థిక ఇబ్బందులు, బాధాకరమైన గతాన్ని ఎదుర్కొంటున్న ఒక రిక్షా డ్రైవర్, అనుకోకుండా ఒక రహస్యమైన ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించడం ‘లాలో’ చిత్ర కథాంశం. అక్కడ చిక్కుకు పోయిన తర్వాత అతను శ్రీకృష్ణుడి ఉనికిని అనుభవించడం ప్రారంభిస్తాడు .

Exit mobile version