Vice President Elections : దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) ఉదయం నుంచి ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 96% మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలుత తన ఓటు హక్కును వినియోగించి మిగతా సభ్యులకు ఆదర్శంగా నిలిచారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మెఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్. మురుగన్ కూడా ఓటు వేశారు.
Vice President Elections Update
ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) మరియు ఐక్య ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు వినియోగించే ఈ ఎన్నికలు ఉదయం 10 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.
ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఒడిశాలోని బిజూ జనతా దళ్ (BJD), పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ (SAD), తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నికలలో పాల్గొనబోమని ప్రకటించాయి. అయితే, ఈ నిర్ణయం ఎన్నికల లెక్కల్లో పెద్దగా మార్పు తేల్చదని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : Kerala Shawarma Shocking : కేరళలో శవర్మ తిని ఆసుపత్రి పాలైన 14 మంది చిన్నారులు

















