Venkateswara Pavitra Samarpana Interesting : శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్ర సమర్పణ

పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

Hello Telugu - Venkateswara Pavitra Samarpana Interesting

Hello Telugu - Venkateswara Pavitra Samarpana Interesting

Venkateswara Pavitra Samarpana : అమరావతి – ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి లోని వేంక‌ట‌పాలెంలో కొలువు తీరిన ప‌విత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ (Venkateswara Pavitra Samarpana) జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్ర నామార్చన, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో పుణ్యా హవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు చేప‌ట్టారు.

Venkateswara Pavitra Samarpana Updates

ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపా లకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠం ధ్వజ స్తంభం, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు రామ‌కృష్ణ‌, సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Also Read : TTD New Programs Interesting : 28 నుండి శ్రీ చెన్న‌కేశ‌వ స్వామి పవిత్రోత్స‌వాలు

Exit mobile version