హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో కొన్నేళ్ల కిందట విడుదలై బాగా నడిచిన సినిమాలను ఒక్కటొక్కటిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కాసులు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. పోయింది ఏమీ లేదని బాగా వర్కవుట్ కావడంతో ఎడా పెడా రిలీజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో విక్టరీ వెంకటేశ్ , ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. కొత్త సంవత్సరం జనవరి 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోయింది ఈ మూవీ అని పేర్కొన్నారు. ఇది ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని ఆయన విశ్వసించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఒక సరికొత్త మలుపును తీసుకు వచ్చేలా చేసిందన్నారు. అయితే సినిమాలో నటించిన నటి ఆర్తి అగర్వాల్ భౌతికంగా లేక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. తను సూసైడ్ చేసుకుంది. ఇక విక్టరీ వెంకీ కెరీర్ లో అత్యంత కీలకమైన చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఒకటిగా నిలిచిందన్నారు. దర్శకుడు కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు అర్థవంతమైన సంభాషణలు రాశారు.



















