Venkaiah Naidu Important Comments : ఉచితాలు కాదు అంద‌రికీ విద్య‌, వైద్యం అందాలి

ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Hello Telugu - Venkaiah Naidu Important Comments

Hello Telugu - Venkaiah Naidu Important Comments

Venkaiah Naidu : అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఉచితాలు కాద‌ని మెరుగైన వైద్యం, నాణ్య‌మైన విద్య కావాల‌ని స్ప‌ష్టం చేశారు. అవి అందించ‌కుండా ఇలా ఉచితాలు ప్ర‌క‌టించుకుంటూ పోతే చివ‌ర‌కు ఖ‌జానా ఖాళీ అవుతుంద‌న్నారు. రాష్ట్రం , దేశం దివాళా తీస్తుంద‌ని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, పీఎం మోదీకి చుర‌క‌లు అంటించారు వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu). ప్ర‌భుత్వాలు విద్య‌, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ ఉచితాలు అలవాటు చేయకూడదని అన్నారు. విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు వెంక‌య్య నాయుడు. వైద్యం ప్రతి మనిషికి అవసరమైన‌దిగా మారింద‌న్నారు.

Venkaiah Naidu Key Comments

ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాల‌ని స్ప‌ష్టం చేశారు. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలన్నారు. అప్పుడే స‌ర్కార్ ప‌నితీరుపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌న్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. అంతే కాదు ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టాల్సింది శాస‌న స‌భ‌లో ప్ర‌జా ప్ర‌తినిధులు నోరు పారేసు కోవ‌డంపై దృష్టి సారించాల‌న్నారు. ప్ర‌ధానంగా ఆయా స‌భ‌లను నిర్వ‌హించే స‌భాప‌తులు మ‌రింత చ‌ర్య‌లు తీసుకునేలా చూడాల‌ని అన్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. బూతుల సాంప్రదాయానికి అడ్డుక‌ట్ట వేయాల‌న్నారు.

Also Read : MP Abhishek Singhvi Shocking Comments : చ‌ట్టాన్ని ఎవ‌రూ ఛాలెంజ్ చేయ‌లేదు : సింఘ్వీ

Exit mobile version