Venkaiah Naidu : తిరుమల – భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుమలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం తాను దగ్గరుండి చూశానని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu). ఈ సందర్బంగా వీఐపీలు, వీవీఐపీలపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
Venkaiah Naidu Shocking Comments on TTD VIP Darshan
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించు కోవాలని సూచించారు. స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
ఈ నేపథ్యంలో వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను తీసుకువస్తే దేవస్థానం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులందరూ భాద్యతతో హుందాగా ఈ సూచనను పాటించాలని కోరారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వీఐపీలకు ఝలక్ ఇచ్చేలా చేశాయి.
ఇదిలా ఉండగా దర్శనానంతరం వెంకయ్య, సతీమణికి రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : TTD EO Effective Orders : శ్రీవారి కళ్యాణోత్సవాల నిర్వహణకు విధానాలు రూపొందించాలి

















