Venkaiah Naidu : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : శ్రీ సత్యసాయి బాబా వ్యక్తి కాదు ఓ శక్తి అని స్పష్టం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu). ప్రేమ, నిస్వార్థ సేవ అనే పదాలకు నిలువెత్తు రూపంగా వెలుగొందిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలకు నాందిగా పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సత్య సాయి బాబా రథోత్సవానికి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా పాల్గొనడం , భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో జరుగుతున్న రథోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రథోత్సవం అనేది సనాతన ధర్మంలోని అనేక ఆలయ ఉత్సవాలలో ఒక భాగం అని పేర్కొన్నారు.
Former Vice President Venkaiah Naidu Comments
పుట్టపర్తితో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఈ రథోత్సవాన్ని శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో భాగంగా అపారమైన భక్తితో నిర్వహిస్తారని తెలిపారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. శ్రీ సత్యసాయిబాబా కేవలం ఒక ఆధ్యాత్మిక శక్తి కాదని, కోట్ల మంది జీవితాలను మార్చిన, మార్గనిర్దేశం చేసిన ఒక మహాశక్తి, ఒక సేవామూర్తి అని అన్నారు. ధ్యానం, పూజలే కాకుండా, నిస్వార్థ సేవ ద్వారానే నిజమైన ఆధ్యాత్మికత సాధ్యమని సత్య సాయిబాబా నిరూపించారని కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచమార్గాల ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింప జేసిన ఘనత సాయిబాబాకు దక్కిందన్నారు. ప్రపంచంలోని నూట ఇరవైకి పైగా దేశాలలో సాయి సంస్థలు ఇదే ప్రేమ, సేవ సందేశాన్ని పాటిస్తూ ఆయన సిద్ధాంతాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read : TTD Chairman BR Naidu Clear Instructions : వైకుంఠ ద్వార దర్వనం సామాన్య భక్తులకే ప్రాధాన్యం



















