నెల్లూరు జిల్లా – తెలుగు ప్రత్యేక అధ్యయన కేంద్రం పనితీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. నెల్లూరులోని ఈ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత పెన్షన్ నుండి రూ. 5 లక్షల మూల నిధిని “తెలుగు భాష-స్వర్ణ భారత్-తిక్కన” అవార్డుకు గా విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇది చాలా సంతోషకరమైన నిర్ణయం. నాకు ఇష్టమైన అంశాలలో తెలుగు భాషా సేవ ముందంజలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం ప్రాచీన తెలుగు ప్రత్యేక అధ్యయన కేంద్రం ఎంపిక చేసే తెలుగు భాషా సేవకులకు ఈ మూల నిధి నుండి అవార్డులు అంద చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ దూరదృష్టితో, మా చొరవతో, ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందనన్నారు. కానీ మా బాధ్యత ఇంతటితో ముగియ లేదన్నారు వెంకయ్య నాయుడు. ఈ కేంద్రం మన రాష్ట్రంలో ఉన్నందున, భాష ప్రచారం కోసం స్థాపించామన్నారు. దీనిని ప్రోత్సహించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని భావించ కూడదన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. తెలుగు నేలపై ఉన్న ఈ కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు రావాలని సూచించారు.
.



















