Venkaiah Naidu : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ స్వరూపడని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu). శ్రీ సత్య సాయి బాబా శత జయంతిని పురస్కరించుకొని చెన్నైలోని ముత్తు వెంకట సుబ్బారావు కన్సర్ట్ హాల్లో “శిష్య కులం” సంస్థ నిర్వహించిన సాయి శిష్య సహస్ర భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి స్మారక సంగీత సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఉప రాష్ట్రపతి. ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
Ex Vice President Venkaiah Naidu Comments
కర్ణాటక, హిందుస్థానీ, భజన, చిత్ర సంగీత సంప్రదాయాల్లో ప్రముఖ కళాకారులు ఒకే వేదికపై కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరు సంవత్సరాల పిల్లల నుంచి అరవై ఏళ్ల వయస్సు వరకు ఉన్న 200 మంది బహుళ తరాల విద్యార్థులతో కూడిన సమూహ గాయక బృందం తమ సంగీతంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారని ప్రశంసలు కురిపించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
భారతీయ కళా సంస్కృతిని ఆధునిక రూపంలో పునరావిష్కరిస్తున్న “శిష్యకులం” సంస్థకు అభినందనలు తెలియ చేశారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతజయంతి వేళ. “సాయి శిష్య సహస్ర సమర్పణ” కార్యక్రమం శ్రీ సత్య సాయి బాబాకు ఘనమైన నివాళి గానే గాక, భారతీయ సంగీత వైభవానికి ప్రతీకగా భావిస్తున్నానని న్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
Also Read : Telangana Defeating MLA’s Sensational : జంప్ జిలానీలలో టెన్షన్ టెన్షన్



















