Venkaiah Naidu : హైదరాబాద్ : స్వామి నాథన్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu). రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో తమదైన ముద్ర వేసిన పలువురికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ప్రతిభ, అనుభవం కలిగిన వారికి ఈ సందర్బంగా పురస్కారాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. 15 సంవత్సరాలుగా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వర రావుని, వారికి చేదోడుగా నిలుస్తున్న ముప్పవరపు హర్షవర్ధన్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
Venkaiah Naidu Interesting Comments
ఇవాళ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కొసరాజు చంద్రశేఖర్ రావు, “భూమిరత్న” బిరుదును అందుకున్న తెలంగాణకు చెందిన భూమి హక్కుల కార్యకర్త ఎం. సునీల్ కుమార్, “కృషిరత్న” బిరుదును అందుకున్న చత్తీస్ ఘడ్ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ముఖ్య కార్య నిర్వాహణాధికారి శ్రీ జొన్నలగడ్డ చంద్రశేఖర (JACS) రావులను ప్రత్యేకంగా అభినందించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. రైతు విభాగంలో, శాస్త్రవేత్తల విభాగంలో, నూతన ఆవిష్కరణల విభాగంలో, విస్తరణ విభాగంలో పురస్కరాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నానని చెప్పారు మాజీ ఉప రాష్ట్రపతి.
Also Read : Jajula Srinivas Goud Fired on KCR : బీసీలకు అవమానం బీఆర్ఎస్ పై ఆగ్రహం

















