Veerappa Moily : బెంగళూరు : కర్ణాటకలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం, నాయకత్వం మార్పుపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ (Veerappa Moily). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. షాకింగ్ కామెంట్స్ చేశారు అధినాయకత్వంపై. మౌనంగా ఉండటం వినాశకరమైనది. ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదని నేను అనుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు వచ్చి ఈ రకమైన లాబీయింగ్‌ను కొనసాగించవద్దని సూచించారు. ప్రత్యేకించి ఈ సమస్యను ప్రజల వద్దకు తీసుకెళ్ల వద్దని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వీరప్ప మొయిలీ. అయితే గతంలో ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Veerappa Moily Shocking Comments
పార్టీలో ఇతర ముఖ్య నేతల కంటే, అనుభవం కలిగిన వారికంటే ఎక్కువగా సమస్య తీవ్రంగా మారిన సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా పరిష్కరించాలో తనకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదన్నారు వీరప్ప మొయిలీ. సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు. 50-50 ఫార్ములా అని పిలవబడేది కాంగ్రెస్‌కు అస్సలు వర్కవుట్ కాదన్నారు. భవిష్యత్తులో ఇదే ఫార్ములా ఉండాలని తాను కోరుకోవడం లేదన్నారు. హైకమాండ్ ఇప్పటికే చాలా ఆలశ్యం చేసిందన్నారు. ఇది పార్టీకి మంచిది కాదన్నారు వీరప్ప మొయిలీ. ప్రస్తుతం ప్రభుత్వం బాగానే నడుస్తోందన్నారు. ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Important Update : పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన
