తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో శనివారం కంచి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచిపురంలోని శ్రీ వర దరాజ స్వామివారి ఆలయంలో జరిగే ప్రసిద్ధ గరుడసే వను పురస్కరించుకుని,శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఈ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా సర్వాలంకార భూషితుడైన శ్రీ వేదనారాయణ స్వామివారు ఉదయం గరుడ వాహనంపై గ్రామవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గరుడునిపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ దివ్యోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించు కోగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). తాగు నీటితో పాటు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. దీంతో ఎండ వేడిమి నుండి సేద దీరేందుకు కూడా చలువ పందిళ్లను ఏర్పాటు చేసింది టీటీడీ. కాగా టీటీడీ అందిస్ఉన్న సేవలను పురస్కరించుకుని సంతోషం వ్యక్తం చేశారు భక్త బాంధవులు.
