దుబాయ్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. బుధవారం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. భారత జట్టుకు చెందిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ 10లో నిలిచాడు. గత కొంత కాలం నుంచి తను అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. ఇటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు. అంతే కాదు తన కెరీర్ లో అత్యుత్తమ రేటింగ్ ను అందుకోవడం విశేషం. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న సీరీస్ లో కీలకంగా మారాడు వరుణ్ చక్రవర్తి. 36 పాయింట్లతో 818 కెరీర్ పరంగా బెస్ట్ పాయింట్స్ సాధించాడు. సఫారీతో జరిగిన మ్యాచ్ లలో ఒక్కో మ్యాచ్ లో 2 వికెట్లు తీశాడు.
అంతే కాదు టి20 క్రికెట్ ఫార్మాట్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధఙంచిన టాప్ బౌలర్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి కావడం విశేషం. ఐసీసీ రేటింగ్ లో తను 8వ ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రకటించిన తాజా రేటింగ్స్ లో టాప్ లో కొనసాగుతున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ . తను 865 రేటింగ్ తో తొలి స్థానంలో ఉండగా తబ్రీజ్ 827 , రషీద్ ఖాన్ 828, సునీల్ సెరైన్ 832 , షాదాబ్ ఖాన్ 811 , వనిందు హసరంగా 809 పాయింట్ల తో టాప్ 10 జాబితాలో ఉన్నారు. 864 పాయింట్లో విండీస్ కు చెందిన శామ్యూల్ బద్రీ నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నాడు. 858 రేటింగ్ తో డేనియల్ వెట్టోరీ 3వ ప్లేస్ లో , 832 రేటింగ్ సునీల్ నరైన్ ఉన్నాడు.
