హైదరాబాద్ : దక్షిణాదిన హాట్ స్టార్ గా గుర్తింపు పొందింది వరలక్ష్మీ శరత్ కుమార్. తను కీలక పాత్ర పోషించిన చిత్రం పోలీస్ కంప్లైంట్ . ఇందులో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషించింది. హీరో గా ఇందులో నవీన్ చంద్ర నటించారు. చిత్రంలో 52 మంది సీనియర్ ఆర్టిస్టులు పాలు పంచుకున్నారు. పూర్తిగా హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారచు . టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి.
ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు.
డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందించాం అని అన్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తారని చెప్పారు.
https://www.youtube.com/watch?v=Itla98sD7J8
