ఏలూరు జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ఏలూరు తూర్పువీధి శ్రీ గంగానమ్మను దర్శించుకున్నారు .శతాబ్దకాలంపైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారీ జాతర 2025 – 26 లో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి తెల్లవారుజామున దర్శించుకున్నారు. హోం మంత్రి అనితకు మంగళ వాయిద్యాలతో, ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు జాతర కమిటీ నిర్వాహకులు .
జాతర సందర్భంగా మేడలలో కొలువుదీరిన శ్రీ కొర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకున్నారు. అమ్మవార్లకు సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వంగలపూడి అనిత. పూజల అనంతరం హోం మంత్రి అనితకు అమ్మవారి చీరను కానుకగా సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ , నిర్వాహకులు..
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ,ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి సారథి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హోమ్ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

















