V Srinivas Goud : హైదరాబాద్ – బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud). కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇవ్వడం పట్ల మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ పూర్తిగా బీసీలకు వ్యతిరేకం అని తేలి పోయిందన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
V Srinivas Goud Shocking Comments on BC Reservation
దేశం మొత్తం ఓబీసీ వర్గాల వెనకబాటుతనంపై చర్చ జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుందన్నారు. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయనే వాతావరణం ఏర్పడిందన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగు ఇపుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావడం గగనమవుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్‌కు మోక్షం లభించ లేదని, ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర బుక్ బిల్లులు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నానా హంగామా చేశారని, ఆ తర్వాత మిన్నకుండి పోయారని ధ్వజమెత్తారు.
బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలది వగల ప్రేమే అని తేలి పోయిందన్నారు. బీసీ ఓట్ల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరుగవన్నారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.
Also Read : Beauty Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాకి పారితోషకం భారీగా పెంచిన జాన్వీ
