Trump : అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొనేందుకు కృషి చేశానని చెప్పారు. ఆదివారం మీడియాతో చిట్ చాట్ చేసిన ట్రంప్ తాను నోబెల్ శాంతి బహుమతికి వంద శాతం అర్హుడినని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. తాను వచ్చాక మొత్తం ఏడు యుద్దాలను అర్దాంతరంగా ముగించానని చెప్పారు. ఇందుకు సంబంధించి తాను అర్హుడినని తెలిపాడు ట్రంప్ (Trump). రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపానని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ద్వారా శాంతికి మధ్యవర్తిత్వం వహించానని చెప్పారు. మరోసారి ఆయన తన వాదనలను పునరావృతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Donald Trump Shocking Comments
అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుల విందులో ట్రంప్ మాట్లాడారు. తాము శాంతి ఒప్పందాలను రూపొందిస్తున్నామని, అంతే కాకుండా యుద్దాలు జరగకుండా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భారతదేశం, పాకిస్తాన్, థాయిలాండ్ , కంబోడియా మధ్య యుద్ధాలు కొనసాగకుండా ఆపానని మరోసారి ప్రకటించారు. ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవాలని న్యాయ శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తాను ప్రభావితం చేసినట్లు చెప్పుకుంటున్న ఇతర సంఘర్షణలను కూడా జాబితా చేశాడు, వాటిలో అర్మేనియా, అజర్‌బైజాన్, కొసావో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్ , ఇథియోపియా, రువాండా , కాంగో ఉన్నాయని వీటిని తానే జోక్యం చేసుకుని నిలిపి వేయడం జరిగిందన్నారు ట్రంప్. తాము ఆయా దేశాలకు వాణిజ్య పరంగా బంద్ చేస్తామని తాను వార్నింగ్ ఇచ్చేసరికి దారికి వచ్చాయని చెప్పారు.
Also Read : CM Chandrababu-AP Growth : కాలుష్య రహితంగా ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబు
















