Chris Wright : అమెరికా : భారత దేశంపై మరోసారి నోరు పారేసుకుంది అమెరికా. రష్యా నుంచి చమురు (ఆయిల్ )ను కొనుగోలు చేయొద్దంటూ కోరింది. ఈ మేరకు ఆదేశ ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ (Chris Wright) కీలక ప్రకటన చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటికే తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు పదే పదే సూచించినా పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. 50 శాతానికి పైగా సుంకాలు విధించినా భారత దేశం తన తీరును మార్చు కోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమెరికా-భారత సంబంధాలను బలోపేతం చేస్తూనే సంఘర్షణను ముగించడం ప్రాధాన్యత అని రైట్ నొక్కి చెప్పారు. రష్యా నుండి చమురు దిగుమతులను పునః పరిశీలించాలని పిలుపునిచ్చారు.
Chris Wright Shocking Comments on India
అమెరికా భారతదేశాన్ని శిక్షించే ఉద్దేశ్యం లేదని, కానీ ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంఘర్షణను ముగించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్ ఫారిన్ ప్రెస్ సెంటర్ లో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో చాలా మంది చమురు ఎగుమతిదారులు ఉన్నారు. భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అన్నారు రైట్. భారతదేశం రష్యన్ చమురును కావాలని కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. దానిని ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. భారతదేశం మాతో కలిసి చమురు కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు
















