రష్యా : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద ఎత్తున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. దీనిపై సీరియస్ గా స్పందించింది రష్యా సర్కార్. సోమవారం ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనుంచైనా తాము యుద్దం చేయడం నుంచి తప్పుకోవాలని సూచించారు .లేక పోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అవును, మేము చెబుతున్నది నిజమే. అమెరికా వద్ద లేని దాడికి ఉపయోగపడే క్షిపణి వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నాయంటూ బాంబు పేల్చరాఉ. ఇంకా వినియోగించబడని అత్యంత అధునాతన క్షిపణులు అక్కడ ఉన్నాయని వెల్లడించారు. కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాకుండా, మొత్తం మధ్య ప్రాంతాన్ని (Middle East) ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన ఆయుధ నిల్వలు ఇరాన్ వద్ద ఉన్నాయని తెలిపారు రక్షణ శాఖ మంత్రి. ఈ విషయం తెలుసుకోకుండా గుడ్డిగా ఇజ్రాయెల్ , అమెరికా దేశాలు దాడికి దిగుతున్నాయని అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ యుద్ధాన్ని తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్య విఫలమైందని ప్రకటించాలని తాము కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో సంభవించే ప్రాణనష్టం ,విధ్వంసం ఎవరికీ ఊహించని రీతిలో ఉంటాయన్నారు.

















