UPI Easy : ఇకపై పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ తో పనిలేదు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది...

Hello Telugu - UPI Easy

Hello Telugu - UPI Easy

UPI : ప్రస్తుతం చిన్నలావాటి కొనుగోళ్ల నుంచి పెద్ద మొత్తాల లావాదేవీల వరకు ప్రజలు డిజిటల్ పేమెంట్‌దే ఎక్కువగా వాడుతున్నారు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవల వల్ల నగదు అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలను మరింత సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

UPI Easy Payments

ఇకపై వినియోగదారులు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా ఫేస్‌ రికగ్నిషన్ లేదా ఫింగర్ ప్రింట్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలకు మార్గం సుగమం అవుతోంది.

బయోమెట్రిక్ చెల్లింపులు ఎలా పనిచేస్తాయి?

యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత, పిన్ టైపు చేసే బదులు, “బయోమెట్రిక్” అనే కొత్త ఆప్షన్ కూడా స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. దాన్ని ఎంచుకున్న వెంటనే ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ ఆధారంగా గుర్తింపు జరగగానే చెల్లింపు పూర్తవుతుంది.

ఈ విధానం వల్ల పిన్ నంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకే వ్యక్తి అనేక యాప్‌లు వాడుతుండటంతో ఒక్కోసారి పిన్లు మర్చిపోవడం సాధారణమే. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది.

సులభతరమే కాదు – మరింత భద్రమైన మార్గం

బయోమెట్రిక్ విధానం భద్రత పరంగా అత్యంత విశ్వసనీయమైనది. మీరు కాకుండా మరెవ్వరూ ఆ లావాదేవీ చేయలేరు. ఫేక్ ట్రాన్సాక్షన్లు జరగే అవకాశం తక్కువ. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, పెద్దవయసువారికి, నిరక్షరాస్యులకూ సులభంగా లావాదేవీలను చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

వినియోగదారుల కోసం మరింత సౌలభ్యం

ఈ మార్పు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత, పిన్ అవసరం లేకుండా ముఖం లేదా వేలిముద్రతో యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. పిన్‌ను ఇంకా వాడాలనుకునే వారికి కూడా ఆ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా రెండు మార్గాలు ఒకేసారి ఉండటం వినియోగదారులకు మరింత సౌలభ్యంగా మారనుంది.

NPCI ఆధ్వర్యంలో తీసుకొస్తున్న ఈ బయోమెట్రిక్ అప్డేట్ డిజిటల్ భారత్ లక్ష్యానికి మరింత వేగం అందించనుంది.

Also Read : New York Firing Sensational : న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో కాల్పులు

Exit mobile version