Bandi Sanjay : హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. తనపై చేసిన అనుచిత కామెంట్స్ పై 48 గంటల్లో సారీ చెప్పాలని లేక పోతే లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ బండికి (Bandi Sanjay). దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంజయ్. తను లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చిల్లర మాటలు, చౌకబారు కామెంట్స్ చేయడం తన స్థాయికి తగదన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చిల్లర మల్లర కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్. ఇంకోసారి గనుక నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Union Minister Bandi Sanjay Warning to KTR
కేంద్ర కేబినెట్ లో కీలకమైన పదవిని నిర్వహిస్తున్న బండి సంజయ్ కుమార్ పటేల్ ఇంతలా దిగజారి పోయి మాట్లాడటం తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నారు కేటీఆర్. ఇంటెలిజెన్స్ విభాగంపై బండి సంజయ్ కనీస పరిజ్ఞానం లేదంటూ ఎద్దేవా చేశారు. నిర్లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రకటనలు హద్దు మీరాయని మండిపడ్డారు. చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. SIT విచారణ అనంతరం బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు కేటీఆర్. దీనిపై స్పందించారు బండి. ఆయనకు అంత సీన్ లేదంటూ కొట్టి పారేశారు.
Also Read : Jimmy Wales Growth : జిమ్మీ వేల్స్ జీవితకాలం వర్దిల్లు..!

















